అలాగే స్వామి ఖాద్రి వృక్షము కింది ఆవిర్భవించడం వలన ఈ క్షేత్రమునకు ఖాద్రి అనే పేరు వచ్చినట్లు పౌరాణిక కథనం చెబుతారు. దేశంలోని ఉన్న ఆలయాలలో కొన్ని నిర్మించినవైతే, మరికొన్ని స్వయంభువుగా వెలశాయని పురాణాల్లో తెలిపారు.
అయితే ఇలా స్వయంభుగా వెలిసిన ఆలయాల్లో కొన్ని ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోతాయి.. అవి నేటికీ పూజలందుకుంటూ మహిమాన్విత క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి.
క్రీ శ 1322 సంవత్సారము పూర్వపు నాటిదిగా చెప్పబడుతున్న ఈ దేవస్థానము ప్రథమదశను బుక్కరాయల పనుపున కుమార కంపరాయలు 1353 నాటికి పూర్తి చేసినట్టు చారిత్రక ఆధారాలద్వారా తెలుస్తోంది.
రెండవ దశ నిర్మాణాలను హరిహరరాయలు 1386-1418 మధ్య కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది.
మూడవ దశ నిర్మాణాలను శ్రీ కృష్ణదేవరాయలు 1509-1529 సంవత్సరాల మధ్యకాలంలో దేవాలయ నిర్మాణం చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
కదిరి పట్టణంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు రెండు ఉన్నాయి. ఒకటి కదిరి పట్టణంలో ఉంటే మరొకటి కదిరి కొండమీద ఉంది. స్వామి వారికి అభిషేకం చేసిన తర్వాత నాభి నుండి వచ్చే నీటినే ఇక్కడి భక్తులు తీర్ధంగా తీసుకుంటారు.
కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోగానే మనకు మొదటగా గాలిగోపురం కనపడుతుంది. దీనిని హరిహర రాయ, బుక్కరాయ, శ్రీకృష్ణదేవరాయలు దశల వారిగా 13-15 శతాబ్దల మధ్య కాలల్లో నిర్మించారు. గాలిగోపురం దాటుకుని లోపలికి వెళ్లిన భక్తులకు కళ్యాణకట్ట కనిపిస్తుంది. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులకు స్నానం చేయడానికి దగ్గరలో బురుగుతీర్థం దర్శనమిస్తుంది. బురుగుతీర్థంలో స్నానాలు పూర్తి చేసుకున్న భక్తులు ప్రధాన ఆలయానికి వెలుపల గల పూజ సామగ్రి దుకాణాలను చేరుకుంటారు. కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రధాను గోపురనికి కుడివైపు వినాయక మరియు కృష్ణుని ఆలయాలు మనకి కనిపిస్తాయి.
ఇక ప్రధాన గోపురాన్ని దాటుకుని లోపలికి వెళితే విశాలమైన ఆలయ ప్రాంగణం కనిపిస్తోంది. ఈ ప్రాంగణంలో పునాది లేకుండా బండాపై నిల్చున్న గరుడస్తంభాన్ని చూసి భక్తులు ఆశ్చర్యానికి గురవుతారు. ప్రధాన ఆలయ విశాల ప్రాంగణంలో కుడివైపు మనకు శ్రీ కోదండరామలయం దర్శనమిస్తుంది. ఇందులో శ్రీరాముడు, సీత, లక్ష్మణ మరియు ఆంజనేయ సమేతుడై ఉంటాడు. సీతారాములను దర్శించుకున్న భక్తులు పక్కనే ఉన్న నాగుల కట్టకు చేరుకుంటారు. ఇలా ఆలయం ప్రాంగణంలో ప్రతి అడుగుకీ ఒక విశిష్టత ఉంది. కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి గర్బాలయంలో స్వామి వారు అమ్మతల్లి, తాయారు మరియు ప్రహ్లాదలుతో మనకు దర్శనమిస్తారు.
గర్భాలయనికి కుడివైపున భృగు మహర్షి స్థాపించిన వసంత వల్లభలు మనకు దర్శనమిస్తారు. అలాగే కుడి వైపుగా వెళ్తే అమృతవల్లి అమ్మవారి ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఇదేవిధంగా ఎడమవైపు వెళ్తే ఆండాళ్ అమ్మవారు మనకు దర్శనమిస్తారు. గర్బాలయనికి అభిముఖంగా గారుడాళ్వారు స్వామి వారి చిన్న మందిరం ఉంటుంది. గర్భాలయ ప్రవేశానికి ఇరువైపులా జయ విజయుల విగ్రహాలు కనిపిస్తాయి.
ఆలయంలోస్వామివారికిఅభిముఖంగాగరుడాళ్వార్చిన్నమందిరంఉంది. గర్భగుడికి వెలుపల అతిపెద్ద జయవిజయుల శిలా రూపాలు దర్శనమిస్తాయి. గర్భాలయంలో కుడివైన స్వామి దర్శనానంతరం వసంతవల్లభుల ఉత్సవవిగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న స్వామి వారి ఉత్సవ విగ్రహాల్లో ఉన్న శోభ మరి ఏ ఇతర ఆలయాల్లో కూడా కనపడదని చెబుతారు.
అష్టభుజుడైన శ్రీ నారసింస్వామి తన నాలుగు చేతులతో హిరణ్యకశిపుడిని తన తొడలపై పరుండపెట్టుకొని అతని వక్షస్థలాన్ని చీలుస్తున్నట్టు, మిగిలిన చేతులలో శంకు చక్ర గదా ఖడ్గాలను ధరించి దర్శనమిస్తారు.స్వామివారి పక్కనే ప్రహ్లాదుడు శిలారూపంలో భక్తులకు కనిపిస్తారు.
ఇక్కడ వెలసిన శ్రీ ప్రహ్లాదవరద లక్ష్మీనృసింహస్వామి వారు స్వయంభువు. దానికి నిదర్శనం స్వామివారి అభిషేకం అనంతరం స్వామి వక్షస్థలంలో స్వేద భిందువులు కానవస్తాయి.
తులసి కట్ట సన్నిథి
ఉత్సవ మండపము
సీతారామ సన్నిధి
వసంతవల్లభులు
ఆలయం నందు భక్తులు తలనీలను సమర్పించుకోవడానికి కల్యాణ కట్ట ఏర్పాటు చేయడంజరిగింది. ఆలయ సమీపంలో భృగుతీర్థం విశాలమైన మరియు ప్రశాంత వాతావరణంలో భక్తులకు స్నానాచరణలకు ఏంతో ఉపయోగం. ప్రధానాలయం తూర్పు గోపురం సమీపంలోనే స్వామివారికి పూజా సామాగ్రి దుకాణాలు ఉన్నాయి.కదిరి దేవాలయంలో ప్రధానాలయం ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంతగా భక్తులకు విచిత్రమైన అనుభూతిని కలుగజేస్తుంది. ప్రధానాలయం కుడివైపున కోదండరామాలయం కలదు. సీతాలక్షణ హనుమంత సహిత శ్రీరామూల వారు కొలువైఉన్న ఈ ఆలయంలోని ప్రాకారాలన్నీ అలనాటి రాజుల సంస్కృతీ సాంప్రదాయాలను గుర్తు చేస్తాయి. ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని మనం ఆలయ స్థంబాలపైనా చూడవచ్చు.గర్బాలయంలో కొలువైన సీతాలక్షణ హనుమంత సహిత శ్రీరాముల వారిని దర్శించుకొన్నాక పక్కన అశ్వత్థ వృక్షం కింద ఉన్న నాగులకట్టకు పూజలను భక్తిశ్రద్దలతో ఆచరిస్తారు.వివిధ నాగదేవతల శిలా రూపాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఎంతో మంది మహిళా భక్తులతో ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఇక్కడ కొలువైన నాగదేవత సంతానప్రాప్తి కలిగిస్తుందని చెప్తారు. తరువాత ఇక్కడి సమీపంలో జమ్మిచెట్టు రామజప స్థూపమును దర్శించుకోవచ్చు. ప్రధాన ఆలయం ఎడమవైపు భాగంలో గోవిందరాజుల ఆలయం ఉంది.గోవిందరాజుల ఆలయ సందర్శనం తరువాత భక్తులు క్షేత్రపాలకుడైన చెన్నకేశవస్వామిని దర్శించుకొంటారు. కొట్టాయ మండపంలోనే స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు.
మరో పురాణ గాథ ప్రకారం భృగు మహర్షి మహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమై తాను ఇక్కడున్న భృగుతీర్థమందు వేంచేసిఉన్నానని తన ప్రతిబింబాలను పూజించి లోకమునకు వెల్లడించమని ఆజ్ఞాపించాడు అంటారు. కావున భృగుమహర్షి వసంత ఋతువు నందు వాటిని వెలికితీసి ప్రాణప్రతిష్ట చేసి వసంతవల్లభులు అనే పేరు పెట్టారట. ఇక్కడ స్వామి వారు వెలసిన ఇంకో కారణం ప్రాచుర్యంలో ఉంది. హిరణ్యకశిపున్ని చంపిన తరువాత స్వామివారి రౌద్ర రూపాన్ని తగ్గించమని ఇంద్రాది దేవతలు ప్రహ్లాదులు కోరగా స్వామి శాంతించి ఇక్కడ ప్రహ్లాదునితో వెలశారని చెపుతారు.ప్రధానాలయం ముందు భాగంలో పంచలోహాలతో నిర్మించిన అతిపెద్ద ధ్వజస్థంభం కనిపిస్తుంది. ఇక్కడ మొక్కుకొని తరువాత స్వామివారి దర్శనానికి వెళతారు.అలనాటి రాజుల శిల్పకళాభిరుచికి ఇక్కడి స్థంబాలు మరియు ప్రాకారాలు ఎంతో అందంగా చెక్కబడి ఉన్నాయి.
1822 వ సంవత్సరము నుంచి ధర్మకర్తల ఆధ్వర్యంలో కదిరి దేవాలయ నిర్మాణాలలో పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. అలాగే 1953లో దుర్గా ఆలయాన్ని అమృతవల్లీ ఆలయంగా మార్పు చేసినట్టు తెలుస్తోంది.స్వామి దర్శనానంతరం అమృతవల్లీ ఆలయానికి చేరుకోవచ్చు. అమ్మవారి ఆలయానికి ఇరువైపులా చండీ ప్రచండి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ ఆండాళ్ అమ్మవారిని దర్శించుకోవచ్చు. కదిరి క్షేత్రం గురించి బ్రహ్మాండపురాణంలో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడి కదిరి కొండను స్తోత్రాద్రి అని అంటారు. ప్రధానాలయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో గల కదిరి కొండను దర్శించుకోవచ్చు. ఈ కొండపైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఉగ్రరూపాన్ని విడిచిపెట్టారని చెబుతారు. ఈ అడవిలో స్వామివారి ఆలయం మరియు స్వామి వారి పాదుకలు దర్శనమిస్తాయి. ఈ పాదాలవలనే స్వామివారికి ఖాద్రి అనే పేరు వచ్చినట్లు చెబుతారు.ఇక్కడ సప్తఋషుల తపోభూమి ఉన్నది. సమీపంలో విగ్నేశ్వరుడు, సత్యనారాయణస్వామి ఆలయం మరియు నవగ్రహాదిదేవతల ఆలయాలు ఉన్నవి.