హిరణ్య కశ్యపుని చంపడానికి మహావిష్ణువు నరసింహ స్వామి అవతారం ఎత్తాడు. రాక్షసుడిని చంపిన తర్వాత కూడా కోపంతో ఉన్న స్వామివారిని కదిరి పట్టణానికి సమీపంలో ఉన్న స్థోతాద్రి కొండ వద్ద, దేవతలు ప్రహ్లాదుడు నరసింహ స్వామిని శాంతింపజేయమని ప్రార్థించారు. నరసింహ స్వామి ప్రార్థనలకు సంతసించి ఈ ప్రదేశంలో కోపాన్ని ఉపసంహరించుకున్నారు. అందుకే ఇక్కడ ఉన్న నరసింహ స్వామి ఆలయాన్ని ప్రహ్లాద సమేత నరసింహ స్వామి ఆలయం అని పిలుస్తారు.
ఇంకా చదవండిSatisfied Clients
‘ఖ’ అంటే విష్ణుపాదం (పాదముద్ర), ‘ఆద్రి’ అంటే కొండ కాబట్టి ఆ ప్రాంతానికి ‘ఖాద్రి’గా పేరు వచ్చింది, తర్వాత ‘కదిరి’గా మారింది. నరసింహ స్వామి చండ వృక్షం (కదిరి వృక్షం లేదా కానరీ ట్రీ) మూలాల వద్ద వెలసినాడని అందువలన కదిరి అనే పేరు వచ్చిందని కూడా అంటారు.
నవ నరసింహ స్వామి వారి క్షేత్రములలో ప్రముఖ క్షేత్రము విరాజిల్లుతున్న శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ దశమి మంగళవారం 19-03-2024 వ తేదీ నుండి ఫాల్గుణ కృష్ణ అష్టమి 02-04-2024 వతేది మంగళవారము వరకు జరుగును.
ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు.
ఇసుకేస్తే రాలంత జనం నమో నరసింహ..గోవిందా గోవిందా అంటూ కదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ప్రతిధ్వనిస్తోంది. ఉదయం నుండి రథోత్సవం ప్రారంభం అవుతుంది. వేద పండితుల వేద మంత్రాలు ప్రబంధ పారాయణాలతో శ్రీసత్యసాయి జిల్లా కదిరి లో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల వేడుకలు కనులారా వీక్షించడానికి తెలుగు రాష్డల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు.
మతాలకు అతీతంగా ప్రజలు ఆలయ ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ ఆలయానికి తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు.
స్వయంభువు శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము.
స్వయంభువు శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము.